Thursday, January 11, 2024

నిశ్శబ్దంలో సమాధుల్లా బతక్కండ-ని హెచ్చరించిన కాలజ్ఞాని ప్రభాకర్- Time wise Prabhakar warned us not to live like graves in silence

 నిశ్శబ్దంలో సమాధుల్లా బతక్కండని హెచ్చరించిన కాలజ్ఞాని ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, 9391533339

 కవిత్వమంటే బడుగుజీవుల బతుకు పుస్తకాలను తెరిచి, వారి కష్టాలను సమాజానికి చూఏడుతూ, సమాజంలోని అందరి బాగును కోరుకొనే రచనలేనని చిత్తశుద్దీతో నమ్మిన అల్పజీవి అలిశెట్టి. భౌతికంగా మనిషి దూరం అయినా, అతని రచనలతో చరిత్రతో పాటు నిరంతరం ప్రజల మనసులో ఉండిపోయే వ్యక్తిత్వంగల అనల్పజీవిగా, తన జీవితకాలంలో తాను నమ్మిన సిద్దాంతలను ఆచరిస్తూ, సమాజంలోని బడుగువర్గాల సమున్నతికి పాటుపడ్డ  అలిశెట్టి ప్రభాకర్.  నునుగు మీసాల వయసులో కలం పట్టిన ప్రభాకర్, 1977 నుండి తన తుది శ్వాస విడిచిన 12 జనవరి 1993 వరకు తన చుట్టూ ఉన్న సమాజంపట్ల బాధ్యతతో, తాను చూసిన, చూడాలను కొన్న సమాజం కొరకు రాస్తూనే ఉన్నాడు.

తెలంగాణ జైత్రయాత్ర స్పూర్తి, తనలో రగిల్చిన భావోద్రేకలను, చివరివరకు తన గుండెల్లో దాచుకొని, తనలో రగిలే భావాలను, తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ కూర్చోకుండా, తనకు తెలిసిన రీఇలో, తాను అనుకొన్నట్లు ఎలాంటి రంగులు పులుమకుండా, పారదర్శకంగా, ఇంకా చెప్పాలంటే ఈ సమాజంలోని అసమానాటలను, అన్యాయాన్ని నగ్నంగా అక్షరీకరించాడు. తన్యమొదటి కవిత సంపుటి పేరే “ఎర్రపావురాలు” అని పెడుతూ, “గుండె నిండా  బాధ కళ్ళ నిండా / నిలలున్నప్పుడు / మాటపెగలదు కొంత సమయం కావాలి “ అన్నట్లు కాకుండా, మొదటి నుండే సమాజంలోని కులలును కడిగేసాడు.

ప్రపంచ భాషలలోని గొప్ప కవులను కానీ, తెలుగు భాషలోని ప్రబంధ సాహిత్యాన్ని కానీ  చదివి అవపోసన పట్టిన మయః జ్ఞాని కాదు. కాదు జగిత్యాల లాంటి చిన్న పట్టణంలో ఉంది. ఆ చుట్టుప్రక్కల జరుగుతున్న ఆనాటి భూస్వాముల దౌర్జన్యాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవాలే ఆయన చదివిన జీవత పాఠాలుగా మారి, తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన స్థానాన్ని పదిలపరచాయి. అందుకే తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ, “మీలోని అజ్ఞానం, సోమరితనం / బీడు భూముల్ని దున్నాలని /పరితపించే ట్రాక్టర్ని” అంటూ తన బాధ్యతను, ఆలోచనలను బయటపెట్టి, చివరి శ్వాస వరకు అదే మాటమీద ఉంటూ, అక్షర సేద్యం చేసిన కాలం వీరుడు ప్రభాకర్.

వెదురు బొంగుల్లాంటి / బ్రతుకులకే / ఆరంగు హంగులెందుకు ?/ నీ ముందున్న/ కాలం ఇనుమును / నీ శ్రమతో కరిగించు /చక్కని శైలితో మలుచుకో / సాధ్యమైనంత మెరకూ/ అంటూ యువతకు స్పూర్తిని నింపిన ప్రభాకర్ కవిత్వం, సోమరితనాన్ని వీడి చైతన్యంతో సమాజాన్ని నీ ఆలోచనలతో మార్చుకోవాలని సూచించారు.  కానీ, “నీ లీఫ్ ను/ బ్యూటీఫుల్ పెయింటింగ్ గా/ మార్చుకోవడానికి/ అట్రాక్టివ్ కలర్` రెడ్` కొరకు/ రక్తం మాత్రం / ఎవరిదీ ఉపయోగించకూ/ అని హెచ్చరించారు.

పెరుగుతున్న జనాభాను మదిలో ఉంచుకొని, తన బతుకే తాను బతకాలేని ఓ జంటకు సంతానం కలిగితే,  అది

జీవన పోరాట క్యూ లైన్ లో ఒకరిమీద ఒకరు పడి, ఒత్తుకొంటే ఎలా ఉంటుందో, తమకే అవకాశాలు లేని ఈ సమాజంలో మరో కొత్త జీవిని ప్రవేశపెడితే ఎలా బతకగలడని ప్రశ్నిస్తూ, “క్యూ” లో / వత్తిగిలి చస్తున్న/ ఇద్దరిమధ్యలోకి / జొరబడిన మరో మనిషిలా.. “ అంటూ సున్నితంగా యువతను  తమ భవిష్యత్ గురించి, జీవితం, కుటుంభం గురించి ఆలోచించెట్లుగా చేస్తాడు.

గుండె పొరలలోంచి వస్తున్న తమ సంతృప్తి జ్వాలాలను ఆర్పీ వేయకుండా, “తపన తపస్సు..” లామార్చుకోవాలని, “ఇనుప తీగల పట్టు సడలి / వాటిని వదిలినపుడు ../ నా తల్లి గర్భంలో / పచ్చగడ్డి సమంగా మోలుస్తుంది./ ప్రతి మముంగిలీ / ముగ్గులతో నవ్వుతుందయి/ అని ఆశలు రేపిన స్పురద్రూపి, 

సమాజంలోని కుళ్లును ఎత్తి చూపడంలో, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడంలో ఏమాత్రం ఏమరపాటు చూపలేదు. “ ఒక నక్క / ప్రమాణస్వీకారం చేసిందట / ఇంకెవర్ని మోసగించనని / ఒక పులి / పశ్చాత్తాపం ప్రకటించిందట / తో టి జంతువుల్ని సంహరించనని / ఈ కట్టు కథ విని / గొర్రెలింకా / పుర్రెలూ పుతూనే ఉన్నాయ్ / అని రాజకీయ నాయకుల బందారాన్ని సున్నితంగా, స్పష్టంగా వెల్లడించారు. వస్తు ప్రదర్శనశాలలో గత చరిత్ర చెప్పే కత్తులు ఇంకా నిగనిగ మెరుస్తున్నాయంటే అవి ఈ నాటి రాజకీయ నాయకుల వాగ్దానాల వల్లే, ఆక్రమవ్యాపారసతుడి అబద్దంలా అమాయకులపై అడికారాన్ని చెలాయిస్తూనే ఉంటాయని, “జ్ఞాపకాల రసి పుండ్లని / గోకటమే వ్యాపకంగా / చావకండి/ నాతో రండి /సహనం సాహసం నిప్పుల మీద /కాలాన్ని వండుకుందాం/ అని మార్గదర్శనం చేసిన ప్రతిభాశాలి మాటలు నిత్య సత్యాలుగా కలకాలం వెలసిల్లుతాయి. 

-----------------------------------

-సిహెచ్ వి ప్రభాకర్ రావు,

 సీనియర్ జర్నలిస్ట్. 9391533339.

302, ఏటర్నల్ కృష్ణ, రోడ్ నం.4. హరిపూరి కాలనీ,

కొత్తపేట, హైదరాబాద్ 500035 

ఫోన్:9391533339