Friday, December 9, 2011

what ever may be the movement- people to sacrify

ప్రజాస్వామ్యం పేరిట చరిత్రలో మిగిలేది రక్త పుటలే

సిహెచ్. వి.ప్రభాకర్ రావు ,
సీఎనియర్ జర్నలిస్ట్

ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర అంతా, అధికారం కోసం జరిగేన పోరాటాలన్నీ, ప్రజల రక్తం పారించిన అధికార దాహం తో నాయకత్వం వహించిన రాజకీయ నాయకుల కుటిల నీత్తుల వ్యూహ రచనలే.ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులమని చెప్పుకొనే వారు కాని ఆ నాటి నీరో చక్రవర్తి కాని తన అవసరాలకొరకు ప్రజలను ప్రజా నాయకులను సమిధలుగా చేసికొని రాజ్యాధికారం పొందినవారే.
అమెరిక గుత్తాధిపత్యాన్ని కానీ అదే రీతిలో రష్యా ఆధిపత్యాన్ని ఎదిరించిన లాటిన్ అమెరిక, దక్షణ ఆసియా దేశాలు కాని గల్ఫ్ దేశాలు కానీ, ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఐన మన భారత దేశం లో కాని ప్రజా ఉద్యమాల నాయకులకు చివరకు మిగిలేది,రాజ్యం ఇచ్చేది మరణ శిక్షే అన్న సత్యం తరతరాలుగా నిరూపించిన సత్యం.
ప్రజలు తమకు అనుకూలంగా లేని ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే వాటిని పరిష్కరించడానికి బదులు వాటిని అనచడమే ప్రభుత్వ దమన నీతిగా వస్తుంది.
ఇటివలి సంఘటనలనే ఉదాహరనగా తీసుకుంటే మొన్నటి నందమూరి తారక రామ రావు కానీ నిన్నటి రాజశేకర్ రెడ్డి కాని నేటి మమత బెనర్జీ కాని అధికారం లేని సమయం లో నక్సలైట్ లను దేశ భక్తులుగా , ప్రజా స్వామ్యవాదులుగా,వారు పోరాడుతున్న సమస్యలు ఆర్ధిక,సామజిక సమస్యలుగా పెర్కొన్నవారే.
మరి అధికారంలోకి వచ్చిన తరువాత వారందరు చేసింది ఒక్కటే.
ప్రతిపక్షం లో ఉన్నపుడు చూసింది వేరు అధికారం చేతిలోకి రాగానే వారి దృష్టికోణం మారిపోయింది నిన్నటి ఆర్ధిక, సామాజిక సమస్య నేడు శాంతి భద్రతల సమస్య గా మారింది.
అన్ని ప్రాంతాలలో ఈ సమస్య ఎందుకు ఈలా ఒకే రీతిలో మారుతుందో రాజకియనాయకులకే తెలిసేంత గొప్ప విషం ఏమి కాదు.అంతర్జాతీయ స్తాయిలో కూడా అమెరికా ఆఫ్గనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ తో సహా వివిధ ముస్లిం తీవ్రవాద గ్రూపులను ఎలా ప్రోత్సహించించింది అందరికి తెల్సిందే. అలగేర్ ఒసామా బిన్ లాడెన్ ను ఎలా మట్టుబెట్టింది మొన్ననే మనం చూసాం.

ఇక మన దేశం పరిస్తితి అంతర్జాతీయ రాజకీయాలకు బిన్నంగా లేదని పశ్చిమ బెంగాల్ లో ని ఈనాటి పరిస్తితి చూస్తె తెలుస్తుంది పశ్చిమ బెంగాల్ లో టాటా కంపనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కాని మొన్న జరిగిన స్తానిక సంస్తల ఎన్నికలలో కాని తృణముల్ కాంగ్రెస్ మావోయిస్ట్ ల సహకారం లేనిదే కమ్యునిసట్ల పై విజయం సాధించారా ? జంగల్ మహల్ ప్రాంతంలో
జరిగిన బహిరంగసభ లలో మమత బెనర్జీ మావోయిస్ట్ లతో కల్సి వేదికలు పంచుకున్న విషయం ప్రపంచానికి తెలియందా ?
ఐనా మమత ఎందుకు ఇంత కర్కశంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచడానికి ఇంత వేగంగా కదిలింది ? మావోయిస్ట్ లలో మూడవ స్తాయి నాయకుడు మల్లోజుల కోటేశ్వర్ రావు అనే
కిషన్ జీ ని ఉన్నపళంగా పట్టుకొని మరి కాల్చి చంపాల్సిన అవసరం ఎమోచ్చిన్ధనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.

ముప్పై ఏళ్లుగా కమునిస్టులు చేయలేని పనిని నెల రోజుల్లో మమత బెనర్జీ చేసి చూపించారు.ప్రజాస్వామ్యాన్ని కమ్యునిస్టులు కాలరచారని ప్రచారం చేసిన నాయకులే తమ అడుగులకు మడుగులోత్తడం లేదనే తమకు అధికారం కట్టబెట్టిన వారిని అంతమోదిస్తున్నారా ? లేఖ ఇద్దారి మద్య ఉన్న అంతర్గత సంభంధాలు ఇక్కడ బయటపడతాయో అని మట్టుబెడుతున్నారా ? ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల సంఘాలు విశ్లేషించాలి. అదే సమయం లో ప్రజాస్వామ్య ఉద్యమకారులు కూడా సగటు రాజకీయ నాయకులతో చేసే చెలి వారి అంతానికే ధరితీస్తున్దనే సత్యాన్ని ఇకనైనా తెల్సికుంటే మంచిది.
మావోయిస్టులు గత అనుభవాలను మరచి చేస్తున్న వ్యూహాత్మక తప్పులే వారి ఉద్యమానికి అతన్కగా మారుతున్నయనడానికి ఎన్నో ఉధహరనలున్నై. చర్చల పేర ప్రభుత్వాలు పిలిచినపుడు వారు చేసే హడావిడే వారిని పోలీసులకు పట్టి ఇస్తుంది. ప్రజా సమస్యలు తీరకముందే వారికి లేని కొత్త సమస్యలు ఈ ఎన్కౌంటర్ల తో మొదలౌతున్నై. ముక్యంగా ఆదివాసిలకు,గిరిజనులకు అండగా ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామనే భరోసాతో వారిని ఉద్యమలో భాగస్వాములను చేస్తున్న మావోయిస్ట్ లు చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలతో గిరిజన, ఆదివాస్సిలు తమ మన ప్రాణాలను పోగొట్టుకోవాల్సివస్తుంది.

ఒకవీరుని మరణం వేలేవేల వీరులకు జన్మనిస్తుంది అనేది సత్యమే కావచ్చ్చు. కాని ఉన్న ప్రాణాలను తీయడానికి వెనుకాడని రాక్షస నీతిని అమలుపరిచే రాజ్యానికి ప్రాణం తీయడమే కాని పోయడం తెలియదని ఇంకా ఉద్యమకారులు తెలిసికొని అమాయక స్తితిలో ఉన్నరనుకోవాలా? 1982 ,జనవరి లో ఆంధ్రప్రదేశ్ కరీం నగర్ జిల్లా, మేడిపల్లి లో జరిగినఎన్ కౌంటర్ మొదలు
పశ్చిమ బెంగలో జరిగిన(2011 ,నవంబర్ ) నిన్నటి కిషన్ జీ ఎదురుకాల్పుల వరకు జరిగిన మరణాలలో ఎ ఒక్కటి అనివార్యమైనది కాదని అందరికి తెలుసు. అయినా ప్రభుత్వాలు ఆలాంటి వాటికే ప్రాదాన్యత ఇస్తున్నాయి. శాంతి యుతంగాప్రజాస్వామ్య బద్దంగా చేసే ఎ ఉద్యమానికైనా మేము అడ్డు రాము అని ప్రభుత్వాలు ఘమ్భిర ప్రకటనలు చేస్తుంటాయి కాని ఆలాంటి వాటిలో ఎ ఒక్క ఉద్యమం అయినా అనుకొన్న పలితాలను ప్రభుత్వంనుంది సాధించిన దాఖలాలు ఉన్నాయా?
అలా సాధించుకోగలం అనే నమ్మకం ఉంటె ప్రజలు ప్రపంచవ్యాప్తంగా హింసను ఆయుధంగా ఎంచుకుంటారు. హింస లేకుండా ఎ ఒక్క ప్రజా ఉద్యమమయినా పూర్తయిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఎక్కడయినా ఉన్నాయా.చివరకి మన దేశ స్వతంత్ర పోరాటం అహింస మార్గం ద్వారానే జరిగిందని ల్చేప్పుకుంటున్నా, మరి ఆంగ్లేయులు క్గుల్లకు క్భాలయిన భగత్ సింగ్ వేరసవర్కర్ లాంటి లక్షలాది మంది స్వతంత్ర పోరాట వీరుల ప్రాణాలు ఎలా గాలిలి కల్సి పోయాయో ఒక్క సారి మననం చేసికొని,విశ్లేశించకోవాలి.

ప్రజాస్వామ్య ఉద్యమాలకు - రాజ్యాధికారానికి మద్య జరిగే పోరాటంలో ఇప్పుడు ప్రజలే సమిధలు కాక తప్పదు.
రాజకీయ అధికారాన్ని ఆశించే ఎ రాజకీయ నేత ఐన ఇందుకు మినహాయింపు కాదని చరిత్ర నిరూపిస్తుంది.పెట్టుబడిదారులే రాజ్యాదిపతులుగా ఎదుగుతున్న ఈ నాటి రోజుల్లో సామాని ప్రజానీకానికి వచ్చేవి మరింత గడ్డు రోజులే.ఒక వైపు ప్రజల కనీస అవసరాలకొరకు జరుగుతున్న ఉద్యమాలను ఉక్కు పాదం తో అణచివేస్తూ , మరో వైపు ఆర్ధిక వ్యవస్తను పెట్టుబదిదారుకు అనుగుణంగా మార్స్తున్న ఈ ప్రభుత్వాలు ఎవరి కొమ్ము కస్తున్నాయో అందరికి తెల్సిందే.
బెంగాల్ లో టాటా లను వ్యతిరేకించిన మమత బెనర్జీ కేంద్రంలో పెట్రోల్ ధరలను పెంచడాన్ని కాని, చిరు వ్యాపారాలలో విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిచాదాన్ని కాని వ్యతిరేకించక పోవడం దేనికి సూచికనో జన్దరికి తెలుసు. అదే బెంగాల్ లో అధికారం కోసం టాటా ప్రాజెక్ట్ ను మవోలతో కల్సి వ్యతిరేకిచారనడానికి ఈ రోజు అదే మావో లపై చేస్తున్న దమనకాన్డయే నిదర్శనం.

మావోల ఉద్యమాల్లో కాని, ప్రత్యెక రాష్ట్రం కావాలని కోరుతూ తెలంగాణలో కాని తమకు తగిన గుర్తింపు కావాలనే గుజ్జర్లు కాని మరో ప్రాంతం లో మరో కారణంగా ప్రజా ఉద్యమాలలో ప్రాణాలు తీస్తున్నది ఎవరు? ఎవరికోసం ఈ సామాన్య జనం తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారో ఈ రాజకీయ నాయకులు ఎ నాడైనా ఆలోచినచారా? నేటి తెలంగాణ ఉద్యమలో
పదవులకోరకు ప్రాకులాడుతున్న మన రాజకీయ నాయకులను చూసి సామాన్య జనం నవ్విపోతున్నా నాకేటి సిగ్గు అనే రీతిలో వ్యవహరిస్తునారే కాని తమను నాయకులుగా చేసిన
ప్రజల కోరికలకు అనుగుణంగా మేదులుకొని ప్రజల గుండెలలో శాశ్వతంగా నిలిచిపోవాలని అనుకునేవారు ఎంతమందో అందరికి తెలిసి పోయింది.
ప్రపంచ ఆర్టిక వ్యవస్థ కుప్పకూలి ప్రజలు ఆహాకారాలు చేస్తుంటే చైనా అమెరికా, యూరోప్ దేశాలు తమ ఆయుధ సంపత్తిని ,న్యూక్లియర్ ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలని చూస్తూన్నాయే కాని ప్రపంచ బడుగు దేశాలలోని అన్నర్తులను ఎలా ఆదుకోవాలని మాత్రం ఆలోచించావు. అది వారి వ్యాపార నీతి. ఎదుటి వారి చావును కూడా అమ్ముకొని లాభాలు గడిన్చాలునుకోవడమే
నేటి రాజకీయం.
మనదేశం లో సామాన్య రైతుకు కనీస అవసరాలు తీరడం లేదని, విత్తనాలు,రసాయన ఎరువులు,డిసెల్ , విద్యుత్ తగిన సమయంలో తగినంతగా దొరకడం లేదని,తమ పంటలకు పెట్టుబడి గిట్టడం లేదని, ఆత్మ హత్యలు చేసికొన్న పట్టించుకోని ప్రభుత్వాలు విదేశీ వ్యాపారులను ఆహ్వానిచి వారికి కావాల్సిన వసతులను కల్పించడానికి మనం కట్టే పన్నులను ధారా పోయడానికి సిద్దపడుతుంది సెజ్ ల పేర ఇప్పటికే ఉన్న భూమిని బడా వ్యాపారులకు,విదేశీయులకు అప్పచెప్పిన ఈ ప్రభుత్వాలు ఇక మిగిలిన పంటను కూడా వారికే అప్పచెప్పి దేశీయ వ్యవసాయ రంగాన్ని నాశనం చేయాలనీ చుస్తున్ధనడానికి చిరు వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను పూర్తీ స్తాయిలో ఆహ్వానిచడమే నిదర్శనం.
ఆ నాడు పారిశ్రామిక విప్లవం గ్రామీణ స్వయం పోషకత్వాన్ని,గ్రామీణ కుటీర పరిశ్రమలను ఎలా నాశనం చేసిందో ఇక అలానే రేపు ఈ గుత్త చిరు వ్యాపారులు మన దేశంలోని వీధి వ్యాపారులను
రోడ్డున లేకుండా చేసి వారిలో కూడా ఆత్మ హత్యలను ప్రోత్సహించడం లో తమ వంతు పాత్రను తాము సక్రమంగా నిర్వహిస్తారనడంలో సందేహం లేదు. కొంతమంది బడా వ్యాపారులకు రాజకీయనాయకులకు అనువైన ప్రణాళికలు రచించాదనికే ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తారు కాని సామాన్య జనానికి అవసరమైన తిన్దిగిజలు అందించడానికి వారికీ తిరిలా దొరకదు.
ఇది మన వేద భూమి,కర్మ భూమి. తరతరాలుగా సాగుతున్న జరుగుతున్న చరిత్రను మార్చడం మల్లి మరో అవతరమేత్తినా ఆ మహా
విష్నువుకే సాధ్యం కాదు
ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంతమంది కిషన్ జీ లు మరణించినా ఎన్ని యుగాలు గడిచినా మారాణి రాజకీయ నైజం ఇది. ఇప్పుడు జరుగుతున్న మావోల ఉద్యమాలకు తోడు సెజ్ ల ఉద్యమంఎక్స్ప్రెస్ రహదార్ల ఉద్యమం భూసంస్కరనల ఉద్యమం గిట్టుభాటు ధరల ఉద్యమం, చదువుకోవాలను కొనే పిల్లల స్కాలర్ షిప్ ల ఉద్యమం లాంటి మరెన్నో ఉద్యమా ల తో పాటు రేపు రోడ్డున పడబోయే చిల్లర వ్యాపరులుర ఉద్యమం కూడా అన్చివేతలకు, ఎదురుకల్పుల్కు లోని నపుడు మనం ఇలాగే రాసుకొంతం, చదువుకుంటాం.ప్రపంచ చరిత్ర అంతా పోరాటాల మయమే. రెండు పోరాటాల మద్య కలం శాంతి కలం అన్న మహనీయుల మహితిక్తులను గుర్తు చేసుకుంటూ ముందుకు పోదాం.మన రాతలు మారి,కొత్త ప్రపంచంలో మన కాగితాలలోని రాతల స్వంయవధ ప్రజా రాజ్యం వస్తుందని ఆశించడం తప్ప ,మనకొరకు ప్రాణత్యాగం చేసిన మన వారికొరకు రెండు వెచ్చటి కన్నీటి బొట్లు,అవీ ఇంకా ఇంకిపోకుండా మిగిలిపోతే, రాల్చడం తప్ప ఏమిచేయలేని ఇస్సహాయ బడుగు జీవులం మనం.
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటూ శాంతి జపం వల్లించుకొని లేని, ఉన్నా కనబడని ఆ దేవుణ్ణి మౌనంగా వేడుకోవాలి" ఈ రాజకీయనాయనయకుల మనసు సామాన్య మానవుల మనసు అర్థం చేసికొనే విధంగా మార్చని" . ఇదే మన కోర్కె.ఇప్పుడు మన కొరకు తమ ప్రాణాలు అర్పించిన ఆదివాసులకు గిరిజన, రైతాంగ, కార్మిక నాయకులకు అశ్రు అంజలులు అర్పించిడం తప్ప ఎదిరించి పోరాడే శక్తి కూడా లేని సామాన్య జనం అశక్తతను చూస్తూ ,వారి బతుకుల్లో బాగు నింపే ఆశాజ్యోతి వెలుగు కొరకు ఎదిరిచూద్దాం ఈనాటి ఎర్రటి రక్ర్తపు చరలె రేపటి ఉషోదయ కిరణాలూ కావలి.అవే మనం ఈ ప్రజాస్వామ్య ఉద్యమ వీరులకు ఇవ్వగల నివాళులు.

Ch.V.Prabhakar Rao,
Sr.Journalist.
Jagtial 505 327.
cell: 091-93915 33339
Published on 2-12-11 in Andhra Jyothi daily,edit page

to me

No comments: