Thursday, January 12, 2012

Alishetty Prabhakar -Telangaana yuga kavi

A tribute to Alishetty Prabhakar- A living Legend-poet & Artist
దేశంలో ఎంతోమంది ప్రజలకోరకని తమ వ్యక్తిగత జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఎంతోమంది సాహిత్య ఉద్యమకారుల్లో జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ ఒకరు.
ఈ వ్యవస్తను మార్చడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసికొని కవిత్వం రాసిన ప్రభాకర్ తన కవితల్లో సమాజంలోని రుగ్మతలను ఎండకట్టి, సామాన్య పాటకుల మన్నలనే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు అయితే ఆయన దాని ప్రతిగా తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది 1980 వరకే సాహిత్య ప్రపంచంలో తనకంటూ,ముఖ్యంగా మినీ- కవితలలో రచనలో ప్రభాకర్ తన ప్రత్యేక ముద్రతో ప్రజల హుద్రయాల్లో స్తిర స్తానం కల్పించుకున్నారు. తన్కుతుమ్బానినికి మూడు పూతల భోజనం కూడా పెట్టలేని స్తితిలో ఉన్నా తన
" చురకులు" కవితల సంపుటిని ప్రచురించి దాని అమ్మకం ద్వారా వచ్చిన కొద్ది డబ్బును ఆస్పత్రిలో ఉన్న చెరబండ రాజు కు ఆర్తిక సహాయంగా అందజేసిన సహృదయుడు ప్రభాకర్.
ఆలోచనలో ఎంతో ఉన్నతంగా ఆలోచించినా తన వ్యక్తిగత జీవితం పట్ల, ఆరోగ్యం పట్ల సరి ఐన శ్రద్ధ వహించక పోవడం తో తను రాసిన` వేశ్య `కవితలా తను కూడా ఈ
"వ్యవస్తకు వశమై
తనువు పుండైన
విప్లవానికి ఊపిరి
ఎప్పుడూ బికారై
ఎందరికో ఒయసిస్సయ్యాడు"
జగిత్యాల లో 1978 సెప్టెంబర్ 9 `న జరిగిన జైత్రయాత్ర లో ప్రజలు చూపిన ఉరకలేసిన ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని "ఎర్ర పావురాలు" గా ` ఎగరేసిన ప్రభాకర్
తన ఊపిరున్నంతవరకు కవితా పావురాలను ఎగరేస్తున్నే ఉన్నాడు.అందుకే ప్రభాకర్ మరణించిన మూన్నాళ్ళకు ఆంధ్ర ప్రభ దిన పత్రికలో "మరణం నా చివరి చరణం కాదు" అనే దీర్గ కవిత అచ్చైనది. ఈ మధ్యకాలం లో తన జీవితంలోని అన్ని కోణాలను,ముఖ్యంగా ఒక సామాన్య మానవుని దుర్భర జీవితపు చేకటి కోణాలను ప్రత్యక్షంగా చూసి అనుభవించిన ఆ అనుభవాన్ని అతని భాగ్యమైన భార్య భాగ్యానికి చూపించాడు.ఒక రకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భాగ్యం, భాగ్యం ఏమో కాని ఆమె తన 15 వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డ ఎన్నడు ప్రభాకర్ కు ఎదురు చెప్పకపోవడం ఒక సగటు భార్య గా కాకుండా భర్త లోని సామజిక తపనను అర్థం చేసికొని సంపూర్ణంగా సహకరించిన పరిపూర్ణంగా చిత్త శుద్ధి తో చివరివరకు ఆయన ఆశయాలకు అనుకూలంగా మెదులుకొన్న సామాన్య బడుగు జీవి భాగ్యం.

జగిత్యాల-సిరిసిల్ల ప్రాంతాలలోని 1980 -1984 సంవత్సరాలలోని రాజకీయ సామజిక పరిస్థితులు ప్రభాకర్ జేవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపడం వల్లే ప్రభాకర్ జగిత్యాల నుండి కరీంనగర్ కు , అక్కడినుండి హైదరాబాద్ కు మకాం మార్చాల్సిన దుర్గతి వచ్చింది. అయన రాసిన కవిత్వంలోని జీవితాన్ని కాకుండా అందులో ఉన్న అక్షరాల భహిరంగ అర్థాన్నే చూసిన ఈ ప్రభుత్వ ప్రతినిధులు పరోక్షంగా ఆయన ను అనేకరకాలుగా వేధించారు.
కవిత్వం అంటే ప్రజల కొరకు, వారి బతుకులు బాగు చేయడానికి, వారి బాధలు ప్రపంచానికి తెలియ జేయడానికే అంటూ ప్రభాకర్ అహర్నిశలు శ్రమించాడు.అతని కవిత్వంలో ఆనాడే పురుడుపోసుకొంటున్న స్త్రీ వాదం, దళిత వాదం కూడా స్తానం కల్పించుకోన్నాయి.

ప్రభాకర్ మన నుండి భౌతికంగా దూరం అయ్యాడని మనం అనుకుంటే ఈ నాడు మనం ప్రభాకర్ ను తలచుకొని ఉండేవారం కాదు ఆయ న మన మాటలలో చేతలలో ఇంకా ఉన్నాడు కనుకనే మన మాటలలో రాతలలో ఇంకా ప్రభాకర్ ఒరవడి కనబడుతుంది. ప్రభాకర్ జీవన భ్రుతికి తోడ్పడిన "ఆంధ్రజ్యోతి" సిటి లైఫ్ శీర్షికన చిత్రకారుడు ఐన ప్రభాకార్ మిత్రులు నర్సింగ్ తో కల్సి రాసిన సెటైర్ కవితలు ఒక కొత్త ఒరవడికి నాంది కాదా? నగర జీవితాలపై రాజకీయాలపై అక్కడి సామాన్య బడుగు జీవులపై అయన రాడిన అనేక పొట్టి కవితలు నేడు ఎంతోమంది రచనలలో ఉపమా అలంకారాలుగా,సెటైర్ లు గా ఉపమానాలుగా వాడుకోబడుతున్నాయి

వకీలు అనేవాడు" ఎకీలు ను ఆ కీలు గా విడగొట్టే "
వానిగా మనకు చూపింది ప్రభాకరే కదా.!
నగరం లోని వాడిపోయిన బతుకుల సగటు జీవి పెదవులపై విరబూసిన చిరునవ్వును
"ప్లాస్టిక్ పువ్వులతో " పోల్చి మన నాగరికత లోగుట్టును బయటపెట్టిన ధీరుడు ప్రభాకర్

ప్రభాకర్ లోని కవిని గుర్తించిన వారిలో ఎమ్వి ఎల్ ఎన్ ను మరవకూడదు. ఎందుకంటే ఆయనే మొదటి సారిగా ప్రభాకర్ చిత్ర కవితలను ఆయన పనిచేసిన పలు కళాశాలలలో ప్రదర్శనకు పెట్టాడు.౧౯౮౨ లో మొదటిసారిగా జగతియాల నుండి వచ్చిన "మంటలు:పక్ష పత్రికలో ఆ తరువాత హైదరాబాద్ నుండి భీంరెడ్డి సంపాదకత్వం లో వెలువడిన చిత్ర భూమి పత్రికలో ప్రభాకర్ గీసిన చిత్రాలతోపాటు కవిత ప్రచురించబడ్డాయి.
తెలంగాణా ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా ఎంతోమంది మరుగున పడ్డ తెలంగాణా ఆణిముత్యాలను వెలుగులోకి తీస్తున్న, ఎందుకో అలిశెట్టి ప్రభాకర్ గురించి అంతగా పట్టించుకున్న దాఖాలాలు కనబడడం లేదంటే కొంతమందికి కోపం రావచ్చు. గత రేడు సంవత్సరాలుగా ఆయన కవితలను అన్నిటిని ఒక చోట చేర్చి ప్రచురిద్దమనుకున్న పెద్దవారి ఆలోచనలు కూడా ఆచరణలోకి రాకపోవడంలో ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభాకర్ సామాన్యులవైపు నిలిసినవాడే కాని ఎ వర్గానికి,సంఘానికి కొమ్ముకాసినవాడు కాకపోవడం కూడా కారంణం కావచ్చు

ఈనాడు ప్రభాకర్ కుటుంభం ఏదో ఒకరకం గా బతుకు గడుపుతుందంటే ఒకరిద్దరు జయదీర్ ,నిజాం లాంటి మిత్రుల సహకారంతో సినారే చేసిన ఉపకారం అందం కొందరికి బాధ కల్గించినా నిష్టూరమయిన నిజం.ప్రభాకర్ ఆనాడు కాని ,ఈనాడు క్భాగ్యం కాని ఎవరి సహాయం కోరడం లేదు కాని మన కవులు సంఘాలు నాయకులు ఎక్కడో ఉన్న వారికి ఏదో ఒక రక మైన సహాయం చేయడానికి వారి రచనలపై సాహిత్య గోష్టులు చర్చలు అవార్డులు ఇవ్వడానికి చూపే ఉత్సాహంలో ఎంతో కొంత అలిశెట్టి ప్రభాకర్ పై కూడా చూపితే ఈతరానికి ప్రభాకర్ కవితలు చిత్రాలు పాట్య గ్రంథాలుగా ఉపయోగపడుతయనడంలో ఇంకా మనం సందేహించాలా. దేశాలో కాని మన రాష్ట్రం లో కాని స్వయంగా కవితలు రాసి వాటికి తానే చిత్రాలు గీసిన కవులు ఎందరున్నారు? ఉన్నవారిలో మనం ఎంతమందిని గౌరవిస్తున్నాం ? ఒక సారి ఆలోచించుకోవడం ఆయన మిత్రుల తోటి కవుల బాద్యత కాదా?
కొన్ని విషయాలు నిష్టూరంగా ఉన్నా వాటిని మనం సింహావలోకనం చేసుకొంటే తప్పుకాడనే ఇలా రాస్తున్నాను.
పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయిన ప్రభాకర్ జ్ఞాపకాలు ఇంకా మనలో నిన్నన మొన్న జరిగినట్లే ఉన్నాయి
ప్రభాకర్ ను చంపింది టి బి రోగం అని మనకు డాక్టర్ లు చెప్పినా ఆయన పేదరికమే ఆయన చావుకు కారణం దాని అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు మన సమాజం చేసిన సహాయం అందరు మహానుభావుల పట్ల చూపిన ఆదరననే.అదే నిర్లక్షం అదే నిర్లిప్తత.
ఇది ఒక ప్రభాకర్ దుస్తితికాదు మన తెలుగు కవుల దురాద్రుష్టం .అయిన సంవత్సరానికొకసారి అయన ఒకటి రెండు చోట్ల ఆయన సంస్మరణ సభలు జరుపుతున్నారు సంతోషం. ఈ ఉద్యమ కలం లో నయినా ప్రభాకర్ కు తగిన స్తానం దొరకాలని ఆశిస్తున్నాం.

ఆనంద్ ప్రభాకర్ ఎంత గొప్పగా బాధలను అనుభవిస్తూ సంతోషంగా చిరునవ్వుతో రోజులు గడిపాడో ఈ నాడు అతని అర్ధాంగి భాగ్యం కూడా అంతే సంతోషంగా తన ఇద్దరు పిల్లలు సంగ్రాం,సంకేత్ లతో , అదే రేకుల షెడ్డులో కాలానికి ఎధురీదుతుంది.ఎంత దగ్గరివారం అనుకున్నా ఆమె బాధను పంచుకోలేకపోవడమే కాదు,ఆమెను పలుకరిన్చాలేకపోతున్నామని చేపడానికి సిగ్గుపడడం లేదు. ఇది నాలోని ఆవేధననే కాని మరోటి కాదు.ఆవేదనతో ఆవేశం తో మనం ఏమి చేయలేమని తెలిసినా ప్రభాకర్ తో కలిసి గడిపిన క్షణాలు గుతోస్తే ఎ సమాజం అయినా తనకు అవసరం ఉన్నన్ని న్నాళ్ళు అందరితో తన అవసరాలను తిర్చుకుంటుంది కాని ఆతరువాత ఆలాంటి వారిని ఎంతమందిని ఈ సమాజం గుర్తుంచుకుంటుంది. ఈ సత్యం తెలుసుకోవాడమే సత్యం నిజం.ఇదే వాస్తవం అదే ప్రభాకర్ విషయంలో కూడా నిజం.

అయినా ప్రభాకర్ కవితలు చిత్రాలు మాల్లి ప్రచురించాబడాలని ఈనాటి యువత కూడా వాటి చదవాలని ప్రభాకర్ చిత్ర కవిత ప్రాధర్షణలు దేశ్శమంత జరగాలని కోరుకోవడం అత్యాశ కాదని అది త్వరలోనే కార్యరూపంలోకి వస్తుందని ఆశిస్తున్నాను.
"పోరుదారిలో
నెల కోరిగిన
............
............
మల్లి మల్లి నాకు
జగిత్యాల గుర్తొస్తుంది
జైత్రయాత్ర నను
కలవరపెడుతుంది" అని
బాధపడిన ప్రభాకర్ తనకు ఎన్ని బాదలున్నా , ఎంతగా పేదరికం అనుభవించినా,టి బి రోగం ఎంతో బాదిస్తున్నా శానోతోరియం లో ఇముడలేక, చివరిరోజుల్లో
జగిత్యాల మిత్రులను చూడడానికి వచ్చినపుడు ఇక్కడే శాతవాహన స్కూల్ హాస్టల్ లో ఉంటె ఎంతో కొంత ఊరట లభిస్తుందని ఎంతమంది చెప్పినా వినలేని అతని
మనసు ఎప్పుడూ
"బాదామయ గాధల్ని
ఈ కలంతో జాలు వార్చినా
నిరంతరం సూర్యుడే నా ముఖచిత్రం " అన్నా ఎప్పుడూ ప్రభాకర్ చిరునవ్వే ఇంకా కళ్ళలో మెదుల్తుంది.

Ch.V.Prabhakar Rao,
Sr.Journalist.
Jagtial 505 327.
cell: 091-93915 33339

3 comments:

sniwas said...

జొహార్ విప్లవ యొదుడా నీకు ఏర్రెర్రని పోరు దండాలు
కామ్రెడ్ అలిశెట్టి ప్రభాకరన్న అమర్ రహే

Siddanta grandala saramenduku naku, na into mundu nundi sagipoina jagityala jaitra yatra padha duli chalu kavitvam tho karachalanam cheyadaniki

sniwas said...

జోహార్ జగిత్యాల జంగు పొరుబిడ్డ
కామ్రేడ్ అలిశెట్టి ప్రభాకర్ అన్న జోహార్ జోహార్ ★
నిజమైన విప్లవకారుడవునివే
తుది శ్వాసవరకు ప్రజాలకోసమే నీ కలం గాళం
అడుగడుగునా దోపిడిరాజకీయాలను నీ అక్షరాయుధం తో తిరుగబడిలేసినవ్ నిర్బంధాలెన్నచ్చిన ఆకాంక్షలు ఎన్నున్నా ఆపలేదు నీ అక్షర జ్యోతిని ప్రజాల బ్రతుకుల్లో వెలుతురు కొరకు బడుగు బలహీన తడిత పీడిత వర్గాల కొరకు నువ్వు చేసే అక్షర పోరాటన్ని చూసి చిన్న పెద్ద రైతు కార్మిక విద్యావంతులు కవులు మేధావులు మహనీయులు సైతం పిడికిలి బిగించి లాల్ సలం అన్నారు
అలుపెరుగని అక్షర పోరులో నింగికెగసిన నేల తార నీ ఆశయాల బాటలో మేము సైతం

DR.ALLALA SRINIVAS REDDY
ARUNA HOSPITAL
JAGITYAL
9866103309

Unknown said...

==============================
నిత్యం జ్వలించే అక్షర ప్రభాకరుడు
==============================
(12 జనవరి అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా)

“వేశ్య” బ్రతుకులో పరకాయ ప్రవేశం చేసి
జీవన సత్యం సూక్ష్మీకరించిన “మినీ కవిత” సామ్రాట్టు
సాహితీ కొలనులో విరబూసిన “ఎర్ర పావురం”
కెమారా లెన్సుతో నగర జీవన గతిని
సామాన్యుని బతుకు స్థితిని బంధించి
వాడుక పదాల వాడితో వేడి పుట్టించి
లేజరు పెన్ను పత్తితో పెట్టిన “చురక”
బ్లాక్ ఇండియన్ ఇంకులో ముంచిన కుంచె/క్రోక్విల్
శ్రమ దోపిడిని ధనరాశుల పాతరల్ని
సమాజ అంతర్గత ఎముకల గూళ్ళని
అశ్రుదారల్ని చిత్రించిన “రక్త రేఖ”
కలిగినోళ్ళ కరబూజ దేహాల మత్తును
బూర్జువాల బూటకపు మోసాల దుమ్మును దులిపి
రాజకీయ రంగును ఉతికేసిన “మంటల జెండా”
రబ్బరు సుత్తి పదాలకు తావివ్వక
రెండు నాల్కల్కల పదగతులు లేక
ఇజాలను బుజాలకెత్తుకోవడాలు
ఇగురంతో బతుకు వెల్లబుచ్చడాలు
మొఖం చాటేయడం తెలియక
నగరం పాలై మోసాల గాయాల బారిన పడ్డా
క్షయ రోగం పీల్చి పిప్పి చేసినా మడమ తిప్పక
దీటుగా “సిటీ లైఫ్” ను ఆవిష్కరించిన విశ్లేషకుడు
అక్షరాల ఖడ్గంతో సమాజం చిలుమును చేదించి
చైతన్య యుద్ధంతో జనంలో స్పూర్తినింపి
బౌతికంగా మరణించినా వెలుగులు విరజిమ్ముతూ
మరచిపోని చెరిగిపోని కవితా ఝరితో
“మరణం నా చివరి చరణం కాదు” అన్న అలిశెట్టి ప్రభాకరుడు
మనోహరాకాశంలో నిత్యం జ్వలించే సూర్యుడు

నాగభూషణం దాసరి – 08096511200 (05/01/2017)