కేంద్ర ప్రతిపాదనలు తెలంగాణవాదులకు ఆమోదయోగ్యం కాదు -జగిత్యాల్ జె ఎ సి ప్రకటన
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికే కేంద్ర హొమ్ శాఖ కొత్తగా మూడు ప్రతిపాదనలను చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ, హైదరాబాద్ తోకూడిన,పది జిల్లా ల తెలంగాణా తప్ప మరే ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రజలు ఆమోదించరు. తెలంగాణా తోపాటు మరికొన్ని జిల్లాలను స్వచ్చందంగా కలపమన్తె కలపాలనే కేంద్ర ప్రతిపాదన తెలనగాన్ జ్ప్రజలను మొసగించడమె.
ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం తెలంగాణతో అన్ని జిల్లాలను కలిపిఉంచాలనె కదా? మరి అలాంటప్పుడు మరికొన్ని జిల్లాలను ఆయా ప్రజల కోరిక మేరకు కలపడానికి కేంద్రం సుముఖం గా ఉంటె ఇప్పుడున్న ఇతర అ 3 జిల్లాలో ఎ జిల్లా వేరుగా ఉంటుందో కేంద్రానికి తెలుసా?
సీమంద్ర పెట్టుబడి దారుల ఒత్తడికి లొంగి అర్థం క్పార్థం లేని ప్రకటనలతో రాష్ట్ర ప్రజలలో మరింత అలజడి సృష్టించడానికే కేంద్రం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు
రాయల సీమ లోని కర్నూల్,అనంతపూర్ జిల్లాలను కలిపి "రాయల తెలంగాణా" ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనను వ్యతిరేకించిన తెలంగాణా ప్రజలు మరిన్ని జ్జిల్లాలను కలిపి తెలంగాణా ను ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదను ఎలా ఒప్పుకొంటారు
అది కాకుండా ఆర్టికల్ 258-ఎ కింద హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలనాలో ఉంచాలనే ప్రతిపాదన ఆంధ్ర దోపిడీ దారుల వాదనకు ఊతమిచ్చేదిగా ఉంది.
హెచ్ ఎం డి ఎ పరిధిని నిన్న మొన్న కూడా పెంచి తెలంగాణా లోని ఐదు జిల్లాలోని పలు గ్రామాలను కలపడం మొదట చేసిన కుత్ర. అదే కుట్ర ను కేంద్రం కూడా కొనసాగించే ప్రయతాహ్నం చేస్తుంది
హైదరాబాద్ నగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంగాని లేదా అర్తిచ్కల్ 258-ఎ కింద పాలన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటె తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా తమ ప్రాంతం లోనే తాము జ్పరాయి పౌరులుగా బతకాల్సి వస్తున్ధి. ఈ క్జ్ప్రతిపాధనలన్ని తెలంగాణా ప్రజలకు ఆమోదయోగ్యం కావని తెల్సిన మరింత కాలయాపన చేయడానికే కాంగ్రెస్పార్టీ ,కేంద్ర ప్రభుత్వం సీమంద్ర నాయకిఉలాథొ కల్సి కొత్త నాటకం ఆడుతున్నాయి
తెలంగాణ ప్రజలు అప్రమత్తం తో ఉండి కేంద్ర జ్జ్ప్రభుత్వ,కాంగ్రెస్ పార్టీ ల కుటిల యత్నాలను అడ్డుకొని,హైదరాబాద్ తో కూడిన పతి జిల్లాల తెలంగాణాను సాధించుకో వడానికి తుది వరకు ఉద్యమ పోరాటం చేయాలి
రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకుల ఉదాసీన వైఖరికి నిరసనగా ఈ నెల 29 న తలపెట్టిన సకల జనుల భేరిని విజయవంతం చెయలి. రాబోయే తెలంగాణా రాష్ట్రం లో ముఖ్య మంత్రి పదవిని ఆశించే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణా ఉద్యమం పట్ల ఉదాసీన వైఖరి అవలంచిస్తూ జ్పార్తి అధిష్టానం వద్ద లొంగి ఉన్తున్నారు. ఈలాంటి మేక వన్నె పులుల మోస పూరిత పద్ధతులను క్ప్రజలలో ఎండగట్టాలి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఎంత ఆలస్యం జరిగితే అంతగా అన్ని రాజకీయ జ్క్పార్తి లు నష్ట పోతాయనే విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిధి. తెలంగాణా కు ద్రోహం చేసే నాయకుడు ఎ పార్టీ కి చెందిన వాడైనా వచ్చే ఎన్నికలలో మట్టి కరవడం
గ్రామాలలో ఉండే అన్ని క్పార్తిల కార్యకర్తలు,నాయకులూ తెలంగాణా ఉద్యమం లో పార్టీ రహితం గా పల్గొంతుంటే రాష్ట్ర స్తాయి నాయకులూ ప్రజలకు ద్రోహం చేసేలా మౌనం గా ఉంటున్నారు టెలనగన జ్ప్రజలంత హైదరాబాద్ తోకూడిన తెలంగాణానే కోరుతున్నారనే విషయాన్ని కేంద్రానికి స్పష్టం గా చెప్పడానికి మల్లి త్వరలోనే గ్రామా స్తాయిలో తెలంగాణా జె ఎ సి ఉద్యమాలు చేపడుతుంది ప్రజల నాయకత్వలో నడిచే తెలంగాణ జె ఎ సి ప్రజల కొరకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం ఎర్పరచుకొంటుంది . ఎంతటి నాయకుడైనా ప్రజాగ్రహానికి గురైతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు శూన్యమే అనే విశ్స్యాన్ని రాజకీయ నాయకులు తెలుసుకొని, తెలంగాణా రస్త్ర ఏర్పాటు ప్రక్రియ తొందరగా ముగించడానికి కేంద్రం వోత్తడి తేవాలని డిమాండ్ చేస్తున్నాం
Ch.V.Prabhakar Rao,
Sr.Journalist.
Jagtial 505 327.
cell: 091-93915 33339
Sr.Journalist.
Jagtial 505 327.
cell: 091-93915 33339
No comments:
Post a Comment